Saturday, September 5, 2009

పదవి ఆస్తా? బాధ్యతా?

మన దివంగత ముఖ్యమంత్రికి కొందరు నివాళులర్పించే విధానాన్ని చూస్తే ఆవేదన కలుగుతోంది. ఒక ప్రజనాయకుడికి ఇదేనా మనమిచ్చే గౌరవం? ప్రజలకి ఒక గొప్ప బాసటగా నిలిచిన శ్రీ వై.యస్స్.ఆర్ గారిని ఖననం చేస్తున్నప్పుడు రోదనలకంటే, వివిధ మతాలవారు ఆయన ఆత్మశాంతికై చేస్తున్న ప్రార్థనలకంటే పెద్దగా జయజయ నాదాలు వినపడ్డాయి. వై.యస్స్.ఆర్ గారి తనయుడు జగన్ని ముఖ్యమంత్రిగా చూడాలి అని అనుకోవటం సబబే కానీ దానికి ఇదా సందర్భం? ఇదా సమయం? “వై. యస్స్ .ఆర్ అమర్ రహే” కి బదులుగా “కాబోయే సీయం జగన్” అని నినదించిన ఆ కార్యకర్తలకి, నేతలకి, అసలు గతించిన మనిషిపైన ఏమాత్రం గౌరవముందో అర్ధమవుతుంది. తండ్రి పోయిన దుఃఖంలో ఉన్న తనయుడిని ఓదార్చే తీరిదేనా? మనుషులయ్యుండి ఇంత విచక్షణలేకుండా ఎలా ప్రవర్తించగలుగుతున్నారు? స్వర్గస్తులయ్యింది మనం రాజ్యాంగబద్ధంగా ఎంచుకున్న నాయకుడు ఆయన మరణాన్ని ఇంకొకరికి పట్టం కట్టే సంధర్భంగా అభివర్నించటం కడు సోచనీయం.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా శ్రీ రోశయ్యగారిని ప్రభుత్వం ప్రకటించింది మరి కొన్ని రోజుల్లో మళ్ళీ అధిష్టానం ముఖ్యమంత్రి పదవి పై ఒక నిర్ణయానికి వస్తుంది, అప్పుడు కదా మన మద్దత్తు ఎవరికన్నది తెలపాల్సింది?

వార్తాపత్రికల్లో జగన్ సీయం కావాలని శిరోముండనం చేసుకున్న అభిమానులు, పిల్లలు అని ఫోటోలు ప్రచురించారు. వారిలో సగానికి పైగా ఉన్నది నాలుగేళ్ళనుండి పదమూడేళ్ళ మధ్యలో ఉన్న పిల్లలే, నిజంగా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఉంటారా? ఆలోచించండి అసలు సీయం అంటే ఏమిటో కూడా సరిగ్గా తెలియని వయసు వారిది ఎవరో కార్యకర్తల ప్రోద్బలంతో జరిగే ఇలాంటి పొలిటికల్ డ్రామాలని అభిమానం అని ఎలా అనుకుంటారో అర్ధంకావట్లేదు. మన రాజ్యాంగంలో ఓటు హక్కు పద్దెనిమిదేళ్ళు పైబడ్డ యువతీయువకులకివ్వటం ఇలాంటి ప్రలోభాలని, బలవంతాలని అడ్డుకోవటానికే కదా.

పూర్వం రాజులహయాంలో సక్షత్రియులు మాత్రమే రాజ్యమేలేవారు (క్షత్రియుడంటే అదో వర్గమో, కులమో కాదు), వారి తదనంతరం రాజ్యాన్ని వారి వారసులకి అందించటం సాంప్రదాయం అది కూడా వారికి సరైన శిక్షణనిచ్చి, పలురకాల పరీక్షలు పెట్టి, బుధ్ధి, తెలివి, రాజనీతి, యుద్ధవిద్యాదులలో ప్రావీణ్యం ఉన్నప్పుడే రాజ్యాధికారాన్ని అప్పజెప్పేవారు, మన ఆస్తిని మన పిల్లలకి పంచివ్వటం సరైనదే కావచ్చు కానీ ఆ క్రమంలోనే, పరాయిదేశస్తులకి కొమ్ముకాచి చివరికి వారికి బానిసలుగా దశాబ్దాలపాటు వెట్టిచాకిరి చేసి దేశాన్నీ, దేశ సంపదలనీ అమూల్యమైన మన జాతి ఔన్నత్యాన్ని, ఆత్మాభిమాన్నాన్ని కోల్పోయాం, మళ్ళీ ఎన్నో రక్తతర్పణలతో స్వతంత్రులుగా అయ్యాం, ఎవరో కొందరు రాజులు భయంవల్లనో, మొహమాటం వల్లనో, పేరాశ వల్లనో, అమాయకత్వం వల్లనో, నిస్సహాయత వల్లనో, లేక పిరికితనం వల్లనో చేసిన పనికి సస్యశ్యామలము, సకలవిద్యా ధామము, సుసంపన్నము ఐన మనజాతి బిడ్డలు తెల్లవరి మోజేతి నీళ్ళు తాగాల్సిన అగత్యం పట్టింది. ఇలాంటిది మళ్ళీ జరగకూడదని ప్రజలనీ, వారి బాగోగులని చూసే బాధ్యతగలిగిన పదవులని సైతం ఆస్తులుగా పరిగణించటం సరికాదనే ఉద్దేశ్యంతో, రాజ్యాలనీ, రాజులనీ కాదని ప్రజలందరిని ఒక నీడకిందకి తీసుకొచ్చి రాజ్యాంగాన్నీ, రాజకీయాన్నీ ప్రవేశపెట్టుకున్నాం. మరి అలాంటప్పుడు ఇంకా ఈ వారసత్వ పరిపాలనలెందుకు? సానుభూతిని ప్రదర్శించటానికి ఇదొక్కటే పద్ధతా?

ప్రభుత్వకార్యాలయాల్లో ఎవరైన చనిపోతే వారి పదవులని వారి వారసులకి అందించే వీలుంది. మంత్ర పదవి కూడా ప్రభుత్వోద్యోగమే కానీ దానిని కూడా మిగతా వాటితో సరికట్టటం ఎంతవరకు న్యాయం? చిన్న ఉద్యోగాలలో అవకతవకలని సరిచేసుకునే వీలు ఉండొచ్చు, వీలుకాని పరిస్తితిలో అయినా ఆ నష్టం తక్కువగానే ఉంటుంది, అదే ఒక బాధ్యతగల మంత్రి పదవిని అనుభవంలేని వారికి ఇస్తే ఎదైనా తప్పు జరిగితే దాని నష్టం ఎంత పెద్దగా ఉంటుందో ఆలోచించాలి. మన దేశ చరిత్రలో ఎందరో వారసులు మంత్రి పదవులు చేపట్టారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, సబితా ఇందిరా రెడ్డి, దగ్గుబాటి పురందరేశ్వరి, తదితరులెందరో మనకి ఉదాహరణగా ఉన్నారు, వారంతా సమర్ధవంతంగా వారి పదవులని చేపట్టలేదా అని అడగొచ్చు, ఇదే సరైనదైతే ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి ఎన్నికలెందుకు? వారి కుంటుంబాలే ఆ పదవుల్లో స్థిరపడిపోవచ్చు కదా? అప్పుడు ఎన్నికల తంతు ఉండదు ప్రతి ఐదేళ్ళకోసారి మనకి ఓటు హక్కు ఉంది అని మనం గుర్తుచేసుకోనక్కర్లేదు, డబ్బు, మందు, గట్రాలను పంచక్కర్లేదు, ఓటు వినియోగించుకోటానికి గంటలతరబడి క్యూలో నిలబడక్కర్లేదు తొక్కిసలాటలు తన్నులాటలు జరగక్కర్లేదు. కానీ మనం ఎన్నికలని నిర్వహిస్తాం, రాజ్యాంగ బధ్ధంగా నాయకులని ఎన్నుకుంటాం ఎందుకని? నాయకుల పని తీరుని గమనించటానికి, నాయకుల అవకతవకలని ఎత్తుచూపటానికి మనదగ్గరున్న ఓటు అనే ఆయుధాన్ని వాడుకోవటం ఎంతో అవసరం కాబట్టి, ఆ ఆయుధమే లేకుంటే మళ్ళీ బానిసత్వశృంఖలాల్లోకి తల్లి భారతిని ఎప్పుడొ నెట్టేసి మరణశిక్ష విధించగలవారున్నారు, దేశాన్ని వేలానికి అమ్మగలిగేంతా మహానాయకులూ ఉన్నారు.

కుటుంబం గొప్పదని చూసి పిల్లలచేతికి అణ్వాస్త్రాన్ని ఇవ్వలేము కదా, ఏం చేస్తారో చూద్దాంలే అని మన భవిష్యత్తును వారిచేతికిచ్చి చూస్తూ కూర్చోలేం కదా, దేశం ప్రయోగశాల కాదు మనమందరం ప్రయోగశాలలోని వస్తువులము కాదు, సానుభూతితో చేసే ప్రయోగం వికటిస్తే ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న మన దేశం గుర్తేలేకుండా పోయే ప్రమాదం ఉంది. మన దేశాన్ని మనమే కాపాడుకుందాం మన తలరాతలని మనమే దిద్దుకుందాం. రాజ్యాంగపరంగా, చట్టపరంగా, న్యాయపరంగా జీవిద్దాం, నాయకులను సానుభూతితో కాక స్పూర్థితో ఎన్నుకుందాం దేశాన్ని ప్రగతిపథాన నడిపిద్దాం.

ఇదేదో ఒకరిపైన కోపంతోనో, వ్యతిరేకతతోనో వ్రాసింది కాదు, ఒక భారతీయ పౌరుడిగా దేశం పట్ల ఉన్న మమకారమే నా మనసునిలా స్పందింపజేసిందే తప్ప మరొకటి కాదు.ఒకసారి ఆలోచించండి ఎవరి మనోభావాలనైనా నొప్పిస్తే మన్నించండి.

మరోసారి మన చిరునవ్వుల ముఖ్యమంత్రి, రాజకీయానికి సొగసుతెచ్చిన మొనగాడు, మడమతిరగని ధీరుడు శ్రీ యేడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పిస్తూ, వారి ఆత్మకి శాంతి ప్రసాదించాలనీ, వారి కుటుంబానికి మనోస్థైర్యాన్ని, గుండెనిబ్బరాన్ని ప్రసాదించమని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తూ..

భవదీయుడు
దారినపోయే దానయ్య



10 comments:

  1. ఎంతబాగ చెప్పారు మీలా అందరు ఆలోచిస్తె బావుండు.

    >>ప్రభుత్వకార్యాలయాలలో ఎవరైనా చనిపోతే వారి పదవులను వారి వారసులకు అందిచేవీలు <<
    ప్రభుత్వవుద్యోగం అనేది ఒకరకంగా బ్రతుకు తెరువు గనుక కుటుంబంలో ఒకరికి వుపాది కలిపించటం అనేది జరుగుతుంది. అదీ క్వాలిఫై అయివున్న వారికి మాత్రమే ఉద్యోగమిస్తారు. ఆఫీసర్ చనిపోతే అతని కుమారుడు కేవలం పది చదివి వుంటే అతడికి అటెండర్ జాబ్ మాత్రమే వస్తుంది. సో దీనివల్ల వచ్చేనస్టం లేదు.
    దేసనాయకుడు పోస్ట్ అనేది బతుకుతెరువుకోసం చేసే వుద్యోగమూ కాదు ఇంట్లో ఒకరికి పదవి ఇవ్వటానికి. అలాగని వంశపారంపర్యంగా వారసులు రావటానికి ఇది రాజరికమూ కాదు.

    ReplyDelete
  2. great post! nenu kooda nandakam tho agree avuthaanu.... normal gaa govt job inherit ayyinattu, minister job inherit avvaledu. enduku ante, normal job selection committee, aa job ki pai adhikaari... minister ki selection committee janaalu. vote chesi, select chese post ni, inheritance kinda ela treat chestaaru? cheyyaleru..ala ayina indira/rajeev/sonia gandhi lu ela vocharu? because vote vese prajala direct control lo ee post lu raavu kanuka.... mana vote okka mana mla/mp ni enchukune varuke... aa paina aaa mp/mla vote chese manishe kada ee cm? so maximum, manaki eee inherited cm nachakapothe, malli ide party ni elect cheyyakunda vundagalam.... the sad state of the irony of the indian democracy...god bless

    ReplyDelete
  3. entaina mana bratukulu inte..daaniki karanam kevalam okate...MANAM MANA AALOCHANA VIDHANAM!!!

    Engg, Science antame tappa enta mandi politics ni oka career ga choostunnam? change avvali change kavali antunnam tappa..change avvatamledu!

    NTR act chesaadani, balakrishna ni choosam..Jr. Ntr ni choostunnam!!Chiranjeevi hero ani, aayana koduku ni choostunnam!! Kaani kutumba vrutti ni enta varaku parimitam cheyyalo aalochincham!!
    Maa taatalu netulu taagaru maa mutulu vaasana choodandi ane pracharam neti rajakeeyam!


    Prajaswamayam ni Racharikam chesestunnaru!! YSR chanipoyaru ante nivalulu arpinchadaaniki teachers day jarupu koledata!! Idi nijanga too much!! Aaayana chaala chesaaru..kadu ananu!!

    Oka Cm ki antha manchi weather forecast, manchi crew and manchi analysis icchina sare, aayana YSR gaaru pattinchokoledu...his casual attitude costed his life...but his death should not stop the other employees from working..Delaying work in secretariat might cost many more lives!!

    ReplyDelete
  4. బాగా రాశారు.
    అయితే ఒకచోట >>> ప్రభుత్వకార్యాలయాల్లో ఎవరైన చనిపోతే వారి పదవులని వారి వారసులకి అందించే వీలుంది. <<< అన్నారు. అల్లా ఎక్కడా లేదు. ఉదాహరణకి ఒక Managing Director or Section Officer చనిపోతే అతని కుమారుడికి ఆ పోస్ట్ ఇవ్వరు. కాక పొతే ఆ కార్యాలయంలో ఏదో అతని అర్హతలకు తగిన ఉద్యోగమిచ్చి ఉపాధి మాత్రం కల్పిస్తారు. అంటే వారికి ఉపాధే తప్ప తండ్రి హోదా లభించదు.

    ReplyDelete
  5. very thought inspiring post daanyya gaaru.. deeni meedha detail ga taravatha spandistha.. na telugu ni koncham saanabettukovaali.. :p

    ReplyDelete
  6. nEnu okappuDu janaaniki aalOchanalO clarity miss avutundi anukunEvaaDini. konta kaalam pOyaaka arthamaindi naaku... janaaniki aalOchinchaalanE clarity miss avutOndani! idi generic observation-E ayinaa ee sandarbhaaniki kooDaa saripOtundi. ee post-lO unnanta mEra aalOchana kooDaa cheyyakunDaanE gaDipEstunnaam manam... enta siggu chETu!

    ReplyDelete
  7. నందకంగారు మరియు ప్రభాకర్ మందార గారు
    ప్రభుత్వోద్యోగాల గురించి మీరన్నది కరెక్టే, ఆ సంగతి అంతగా ప్రత్యేకించి చెప్పలేకపోయాను..... కాకుంటే నా ఉద్దేస్యమేమిటంటే జీవనోపాదికోసం కావచ్చు, మరేదైనా కావచ్చు, ఒక పదవి లేక ఒక బాధ్యత అది క్లర్కు పోస్టవ్వనివ్వండి, లేక మేనేజరు పోస్టు కానివ్వండి, ఏదైనా అర్హత పైన ఆధార పడి ఇచ్చే పద్దతి ప్రవేశపెట్టగలిగితే బాగుంటుంది అని, ఎందుకంటె ఎంప్లాయిమెంటు ఎక్స్చేంజీల దగ్గరా, చేతిలో డిగ్రీలు పట్టుకుని కనీసం ఓ చిన్నపాటి ఉద్యోగమైనా ఇప్పంచమని ప్రాధేయపడుతున్న వారేంతో మంది ఉన్నారు, పదవీకాలంలో గతించిన యే ఉద్యోగి కుటుంబాన్నైనా ఆదుకోవటానికి జీవనోపాది కల్పించటం సబబే కాదనను కాని ఎందుకో నామట్టుకు నాకు ఏమనిపిస్తుందంటె ఏదైనా డబ్బే కనుక ఆ మరణించిన ఉద్యోగికి రావలసిన పెన్షనులనో, ఇన్సూరెన్సులనో ఏదో ఓ రూపేణ నెల నెల ఇంత వారికి అందేట్టుగా బ్యాంకులలో ఫిక్సుడు డిపాజిటులాంటిది చేసి సాయపడితే బయట పనికోసం పడిగాపులుకాస్తున్న అర్హుడైన ఇంకోఉద్యోగికి ఆ స్థానం ఇస్తే ఇంకా బాగుంటుంది ... ఇది మనం తీరికగా మరో పోస్టులో మాట్లాడుకుందాం ఏమంటారు?
    మీరు మీ అభిప్రాయాలను తెలిపినందుకు చాలా ధన్యవాదాలు
    రోజు రోజుకీ మారుతున్న రాజకీయ ముఖచిత్రాన్ని చూస్తుంటే ఎవరి చేతికి రాళ్ళిచ్చామా అని భయమేస్తోంది, ఒక మనిషి యొక్క సహనశీలత, కృయాశీలతా రెండూ కూడా ఇలాంటి విపత్కర పరిస్తితులలోనే సరిగ్గా చూడగలుగుతాం, మంత్రులుగా మళ్ళీ ప్రమాణాస్వీకారం చెయ్యటానికి ఒక రబస, ఎందుకూ అంటే ఎలానూ మళ్ళీ ఇంకో సీయం ని ఎన్నుకుంటారు కదా మళ్ళీ అప్పుడు చెయ్యాలి కదా అని అనటంలో నాకు వారి లాజిక్ కంటే వారి అసహనం, అలసత్వం కనిపిస్తున్నాయి నా ఆలోచన తప్పు కావచ్చు, కాని ఇది ఒక సామాన్యుడి అభిప్రాయం

    ReplyDelete
  8. @పునర్వసుగారు, kaushik,Ramakrishna podila,suchi and all
    Thanks for your comments, support and encouragement

    ReplyDelete
  9. @.C (nachaki)
    correcte saamaanya baDugu, niraksharaasyulainavaarini pakkanapeDitE, sirivennelagaaru raasinaTlu, convenTulO collegelO Em nErchukunnaam manamasalu? anna chandaana,
    aalOchanaa pariNiti peragaali, dRkpatham maaraali ani anaTaaniki mundu aalOchinchaali anE aalOchana raavaali aa rOjukOsam eduruchUstU kUrchOvaalsindEnaa?

    ReplyDelete