Monday, March 23, 2009

ఎలెక్షన్ పోస్టర్

రాష్ట్రమంతా ఎన్నికలహోరులో యమాబిజీగ ఉంది, ప్రతి ఒక్క పార్టి తమ తమ గొప్పదనాలని చాటుతూ ఎన్నో పోస్టర్లు ప్రచురించింది, ఈ తరుణంలొ మొన్నీమధ్య నేను కుకట్ పల్లి వెళ్ళాను అక్కడ ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన పోస్టర్లు దర్శనమిచ్చాయి.. ప్రింటింగన్నాక అచ్చు తప్పులుండటం సహజం … ఈ కింది పోస్టర్ని గమనించండి..



సెల్ ఫోనులో తీసినది కనుక అంత స్పష్టంగా ఉన్నట్టు లేదు… సరే అదే పోస్టర్ని ఇంకొంచం జూం చేసి తీసిన ఫొటో ఈ కిందది



పేద ప్రజల గుండె చప్పుడు కాంగ్రెస్, అని చాటే ఈ పోస్టర్లో బ్లూ హైలైటింగుతో ఉన్న రెండో లైను చూడండి.. 'ఇందిరమ్మ రాజ్యంలో సోనియాగాంధీ వై.యస్.ఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షం' అని ఉందనుకుంటున్నారా కాదు జాగ్రత్తగా చూడండి…


“రాష్ట్రం” అనే పదంలో “రా” అనే అక్షరం ఎగిరి పోయింది. అదేమంత పెద్ద తప్పిదం కాకపోవచ్చు, కానీ అసలే ఎవరెక్కడ చిన్న తప్పులతో దొరుకుతారా వారి డొక్క చింపి డోలు కట్టి దండోరా వేద్దామా అని నిత్యం ఎదురుచూసే ప్రతిపక్షాలకి, మీడియా బృందాలకి అవకాశమిచ్చినట్లే కదా… “ప్రచార పోస్టెర్లలోనే తప్పులు ప్రచురించే కాంగ్రెస్” అనో, “ఈ చిన్న తప్పిదాలనే గమనించని కాంగ్రెస్ రాష్ట్రం లో ఉండె అవకతవకలని ఇంకేం గమనిస్తుందనో” హెడ్డింగు పెట్టి యే పేపరో ప్రచురించిందనుకోండి….. ఇంకేం ఇక ప్రతిపక్షాలకి ఇంకో రెండు రోజులు చేతినిండా, నోటినిండా పని దొరికినట్లే..

ఏదేమైనా ప్రచురణాదోషాలను జాగ్రత్తగా గమనించి ఆ తరువాతే అతికించాలని ఈ నాయకులకో, ఆ కార్యకర్తలకో తెలిపేదెవరో.....


ఇట్లు భవదీయుడు
దారినపోయే దానయ్య

3 comments:

  1. ప్రతి పక్షాల సంగతి ఎలా ఉన్నా నువ్వు బాగానే ఎండగట్టాలనే ప్రయత్నం మొదలెట్టావని అర్థం అయ్యింది!

    ఇంతకీ ఈ సదరు దానయ్య గారు మున్ముందు ఏం చేస్తారో చూడాలని ఉంది :)

    ReplyDelete
  2. అన్నన్నా ఎంతమాటా... ఈ దానయ్య దారినపోతూ గమనించిన సంగతి మీతో పంచుకున్నాడే కానీ ఏ ఒక్క ప్రత్యేకమైన పార్టీనీ ఎండకట్టాలని చూడట్లేదు..
    ఏదేమైనా మీ ప్రేక్షకత్వానికి ధన్యవాదాలు

    ReplyDelete
  3. బా'పట్టావ్! అందరూ ఇంత జాగ్రత్తగానూ గమనిస్తే ఎన్నికల్లోనూ, పాలనలోనూ తప్పులు దొరలవు కదా... హా!

    ReplyDelete